
సిడ్నీ : టీమిండియా గబ్బర్.. ఓపెనర్ శిఖర్ ధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోపై ఒక నెటిజన్ పెట్టిన కామెంట్‌పై ధీటుగా కౌంటర్ ఇచ్చాడు. అసలు విషయంలోకి వెళితే.. ఆసీస్‌తో వన్డే, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ధవన్ టెస్టు జట్టుకు ఎంపికకాని మిగతా ఆటగాళ్లతో స్వదేశానికి పయనమయ్యాడు. కాగా విమాన ప్రయాణంలో ధవన్ తన సహచరులైన దీపక్ చహర్, యజ్వేంద్ర చహల్‌లతో కలిసి సరదాగా ఫోటో దిగాడు. దానిని గబ్బర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి 'కళ్లలోని గుడ్లు పీకేసి గోలీలాట ఆడుతామంటూ' సరదాగా క్యాప్షన్ జత చేశాడు. (చదవండి : బుమ్రా షాట్.. ఆసీస్ బౌలర్‌కు గాయం)
ధవన్ పోస్టుపై ఒక నెటిజన్ వ్యంగంగా స్పందించాడు.'ఈ వేషాలకు ఏం తక్కువ లేదు..పేడ మొహాలు,చెత్త గేమ్‌ప్లే' అంటూ కామెంట్ చేశాడు.నెటిజన్ కామెంట్‌పై స్పందించిన ధవన్..' అవును .. మీ ఇంట్లో నీ గురించి కూడా ఇదే అనుకుంటున్నారంటూ' ధీటుగా బదులిచ్చాడు. ప్రస్తుతం శిఖర్ ధవన్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శిఖర్ ధవన్ ఆసీస్ టూర్‌లో పర్వాలేదనపించే ప్రదర్శనను నమోదు చేశాడు. ఐపీఎల్ 13వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున టాప్ స్కోరర్‌గా.. ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచిన గబ్బర్.. ఆసీస్ టూర్‌లో మూడు వన్డేలు కలిపి 120 పరుగులు.. మూడు టీ20లు కలిపి 82 పరుగులు సాధించాడు. అంతేగాక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా ధవన్ నిలిచాడు. కాగా ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపిక కాని ధవన్ ఫిబ్రవరి 2021లో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. (చదవండి : రోహిత్ శర్మకు లైన్ క్లియర్)