
మార్క్‌హామ్ (కెనడా): భారత యువ షట్లర్ లక్ష్య సేన్ వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన అండర్–19 పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ లక్ష్యసేన్ 15–21, 21–17, 21–14తో తొమ్మిదో సీడ్ చెన్ షైయూ చెంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు.
అండర్–19 పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్–పంజాల విష్ణువర్ధన్ గౌడ్ జంట క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణ సాయికుమార్–విష్ణువర్ధన్ జంట 21–11, 21–17తో ద్వికి రాఫియాన్–బగాస్ కుసుమ వర్ధన (ఇండోనేసియా) ద్వయంపై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.