shuttle
-
క్వార్టర్స్‌లో లక్ష్య సేన్
మార్క్‌హామ్ (కెనడా): భారత యువ షట్లర్ లక్ష్య సేన్ వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన అండర్–19 పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ లక్ష్యసేన్ 15–21, 21–17, 21–14తో తొమ్మిదో సీడ్ చెన్ షైయూ చెంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. అండర్–19 పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్–పంజాల విష్ణువర్ధన్ గౌడ్ జంట క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణ సాయికుమార్–విష్ణువర్ధన్ జంట 21–11, 21–17తో ద్వికి రాఫియాన్–బగాస్ కుసుమ వర్ధన (ఇండోనేసియా) ద్వయంపై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. -
‘షటిల్’ సంబరం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ అభిమానులను గత కొద్ది రోజులుగా అలరిస్తూ వచ్చిన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) చివరి అంచెకు చేరుకుంది. లీగ్ దశలో ఆఖరి రెండు మ్యాచ్‌లు నేడు, రేపు హైదరాబాద్‌లో జరగనున్నాయి. దాంతో పాటు నాకౌట్ మ్యాచ్‌లకు కూడా నగరమే వేదిక కానుంది. రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లతో పాటు జనవరి 14న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ కూడా జరుగుతుంది. షటిల్‌కు ఇప్పటికే అడ్డాగా ఉన్న హైదరాబాద్‌లో పీబీఎల్ గత రెండు సీజన్లలో జరిగిన మ్యాచ్‌లకు కూడా మంచి స్పందన లభించింది. ఇప్పుడు కూడా పండగ సమయంలో బ్యాడ్మింటన్ అభిమానుల సంబరానికి మరో అవకాశం లభించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికను చూస్తే లోకల్ టీమ్ హైదరాబాద్ హంటర్స్ దాదాపుగా సెమీస్ స్థానం ఖాయం చేసుకోవడంతో హైదరాబాద్ అంచె మ్యాచ్‌లపై మరింత ఆసక్తి పెరగడం ఖాయం. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డాషర్స్‌తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడుతుంది. ఢిల్లీ జట్టులో మహిళల సింగిల్స్ ప్రపంచ మూడో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (కొరియా)... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ తియాన్ హువీ (చైనా)... నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టులో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)... ప్రపంచ 20వ ర్యాంకర్ అజయ్ జయరామ్ (భారత్)... బెంగళూరు బ్లాస్టర్స్ తరఫున పురుషుల సింగిల్స్ ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్... మహిళల డబుల్స్‌లో స్థానిక క్రీడాకారిణి సిక్కి రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. డిసెంబర్ 23 నుంచి జరుగుతున్న ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గువాహటి, ఢిల్లీ, లక్నో, చెన్నై నగరాలు ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లకు వేదికలుగా నిలిచాయి. bookmyshowలో ఆన్లైన్ ద్వారా లేదా మ్యాచ్ రోజుల్లో గచ్చిబౌలి స్టేడియం వద్ద కౌంటర్లలో కూడా టికెట్లు లభిస్తాయి. లీగ్ మ్యాచ్‌లకు రూ.500గా టికెట్ ధర నిర్ణయించగా... సెమీస్ కోసం రూ.700, ఫైనల్‌కు రూ.900కు టికెట్లు లభిస్తాయి. హైదరాబాద్ మ్యాచ్‌ల షెడ్యూల్ అన్ని మ్యాచ్‌లు రా.గం. 7.00 నుంచి జనవరి 10 : ఢిల్లీ డాషర్స్ గీ నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జనవరి 11 : హైదరాబాద్ హంటర్స్ గీ బెంగళూరు బ్లాస్టర్స్ జనవరి 12 : తొలి సెమీఫైనల్ జనవరి 13 : రెండో సెమీఫైనల్ జనవరి 14 : ఫైనల్ -
ఉత్సాహంగా షటిల్ పోటీలు
ఫన్‌టైమ్స్ క్లబ్లో ప్రారంభం విజయవాడ స్పోర్ట్స్ : జిల్లా బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో పటమట ఫన్‌టైమ్స్ క్లబ్లో శుక్రవారం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. చిన్నారి క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో సత్తా చాటుకున్నారు. టోర్నీని నగర మేయర్ కోనేరు శ్రీధర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బ్యాడ్మింటన్‌లో విజయవాడ నుంచి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారన్నారు. మూడురోజుల పాటు ఈ పోటీలను నిర్వహిస్తున్న ఫన్‌టైమ్స్ క్లబ్‌ను ఆయన అభినంధించారు. బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ అంకమ్మ చౌదరి, వై.రమేష్‌బాబు, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అ««దl్యక్ష,కార్యదర్శులు ఆర్.రామ్మోహనరావు, డాక్టర్ ఇ.త్రిమూర్తి, ఫన్‌టైమ్స్ క్లబ్ కార్యదర్శి వి.సాంబశివరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి వి.రాధాకృష్ణ , స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు ఫలితాలు: బాలుర అండర్–13 విభాగంలో టి.రాహుల్ (కేకేఆర్గౌతమ్) 30–12 తేడాతో జె.ఇషాన్ ((డీఆర్ఎంసీ)పై, టి.హర్షన్ (వీపీఎస్) 30–12 తేడాతో అమనకుమార్ (కేకేఆర్ గౌతమ్)పై, సుభం కుమార్ (కే కేఆర్ గౌతమ్) 30–13 తేడాతో బీఎస్ఎస్ కార్తీక్ (ఫన్‌టైమ్స్), వీవీ సాయి (ఫన్‌టైమ్స్) 30–4 తేడాతో ఎండీ మున్వర్ (కేకేఆర్ గౌతమ్)పై, వి,అన్షుల్ (ఫన్‌టైమ్స్) 30–10 తేడాతో వై.శ్రీవంత్ (కేసీపీ సిద్ధార్థ)పై, టి.ప్రణవ్ (రవీం’ధ్రభారతీ) 30–10 తేడాతో ఎల్.రోహిత్ (ఫన్‌టైమ్స్)పై గెలుపొందారు. అండర్–13 బాలికల విభాగంలో కె.రిషిక (వీపీఎస్) 30–4 తేడాతో వి.మిషా్వని (విజయవాడ)పై, డి.రష్మిత (వీపీ సిద్ధార్థ) 30–5 తేడాతో బి.లలితలాస్య (విజయవాడ)పై గెలుపొందారు. -
అద్భుత ప్రతిభ
-
షటిలర్స్.. షహర్
చార్మినార్.. గోల్కొండ.. బిర్లామందిర్.. హైటెక్ సిటీ.. ఇలా హైదరాబాద్‌కీ షాన్‌గా నిలిచే జాబితాలోకి షటిల్‌ను కూడా చేర్చాలేమో. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ బ్యాడ్మింటన్ జరిగినా.. మన సిటీ రాకెట్లు రివ్వున దూసుకుపోతున్నాయి. సైనా మొదలు సాయిదత్ వరకు విజయ పరంపర కొనసాగుతోంది. తాజాగా గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో నలుగురు హైదరాబాదీలు పతకాలు సాధించడం విశేషం. స్వర్ణ, రజత, కాంస్యాలతో మన షటిల్ ఎక్స్‌ప్రెస్ దూసుకుపోయింది. వీరంతా ఇక్కడే ఆటలో ఓనమాలు నేర్చుకొని ఇంతింతై... వటుడింతై అన్నట్లు ఎదిగారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంతో వారికున్న అనుబంధాన్ని ఆ నలుగురు పంచుకున్నారు. ఫ్రమ్ హైదరాబాద్ ‘నేను హైదరాబాదీని అని చెప్పుకోవడంలోనే నాకు గర్వంగా అనిపిస్తుంది. టోర్నీల్లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లినప్పుడు కూడా కేవలం ఇండియాతో సరి పెట్టకుండా ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పుకుంటాను. బయటి వాళ్లలో కూడా చాలా మందికి మన సిటీ గురించి బాగా తెలుసు. ఇక్కడి ప్రతీ చోటు ఇష్టమే. చార్మినార్ వంటి చారిత్రక ప్రాంతాల నుంచి కొత్త తరం మాల్స్ వరకు ఎక్కడైనా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. ఎల్బీ స్టేడియంలో శిక్షణ నుంచి ఏ స్థాయికి చేరుకున్నా అన్నీ హైదరాబాద్‌తోనే ముడిపడి ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా మన సిటీ మరో మెగా ఈవెంట్‌కు వేదిక అవుతుందని నమ్ముతున్నా. నేను అందులో భాగం కావాలని కోరుకుంటున్నా. బిర్యానీ భలే రుచి ‘నేను పుట్టి పెరిగింది ఇక్కడే.. హైదరాబాద్ తప్ప మరో సిటీ గురించి ఊహించలేను. ఇతర నగరాలతో దీనిని పోల్చడం కూడా సరైంది కాదు. సికింద్రాబాద్‌లోని ఆగ్జిలియం స్కూల్లో, ఆ తర్వాత మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజీలో చదువుకున్నాను. చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌పై దృష్టి పెట్టాను కాబట్టి ఫ్రెండ్స్‌తో తిరగడంవంటి సరదాలు తక్కువే. ఎక్కడికి వెళ్లినా అమ్మా నాన్నలతోనే. మన హైదరాబాదీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందులోనూ బిర్యానీ టేస్ట్‌కు పడి చస్తాను. అందుకే నా ఫేవరేట్ ఫుడ్ పాయింట్ అంటే ప్యారడైజ్ హోటలే. అక్కడ లభించే అన్ని వెరైటీలను టేస్ట్ చేస్తాను. భవిష్యత్తులోనూ హైదరాబాద్‌కు గర్వకారణంగా నిలుస్తాను. ఈజీ గోయింగ్ సిటీ హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. మధ్యలో మూడేళ్లు బెంగళూరు వెళ్లడం మినహా అంతా ఇక్కడే ఉన్నాను. బహుశా నగరంతో అనుబంధం పెరిగిపోవడం వల్లే తొందరగా వెనక్కి వచ్చేశానేమో! ఆల్ సెయింట్స్ హైస్కూల్, రత్న జూనియర్ కాలేజి, సెయింట్ ఫ్రాన్సిస్ (బర్కత్‌పురా)లలో నా చదువు సాగింది. ఈ సిటీ గురించి సరిగ్గా చెప్పాలంటే కంఫర్ట్.. ఈజీ గోయింగ్.. ఈజిలీ రీచబుల్. ఎల్బీ స్టేడియంలో తొలిసారి రాకెట్ పట్టుకొని ఫుల్ వైట్‌డ్రెస్‌లో అడుగు పెట్టిన రోజు నాకు ఇంకా గుర్తుంది. నాటినుంచి ఇప్పటి వరకు నేనేం సాధించినా హైదరాబాదీగానే. మొదట్లో మేం బషీర్‌బాగ్, ఆ తర్వాత అత్తాపూర్‌లో ఉండేవాళ్లం. ఇప్పుడు అకాడమీకి దగ్గరగా గచ్చిబౌలికి మారాం. సిటీ బస్సుల్లో వేలాడుతూ గ్రౌండ్‌కు చేరిన రోజులు ఉన్నాయి. కానీ దానినీ ఎంజాయ్ చేశాను. సిటీ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో దాదాపు ప్రతీ హోటల్లో వెరైటీ ఐటమ్స్ ప్రయత్నించాను. హైదరాబాద్ స్పోర్ట్స్ సిటీగా మరింత పేరు తెచ్చుకోవాలని నా కోరిక. మధుర జ్ఞాపకం చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో ఎంజాయ్ చేసినంత నేను ఎక్కడా ఎంజాయ్ చేయలేను. టోర్నీల కోసం బయటి నగరాలకు వెళ్లడం తప్పదు. ఆల్ సెయింట్స్ హైస్కూల్, ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివాను. అజహర్లాంటి క్రికెటర్లు చదివిన స్కూల్లోనే చేరగానే నాలో అనుకోకుండానే క్రీడాకారుడి ఆలోచనలు వచ్చాయేమో! సిటీలో నాకు బంధుమిత్రులు చాలా మంది ఉన్నారు. నా కజిన్స్తోనే అన్ని సరదాలు. వారాంతంలో జీవీకే మాల్, ఇనార్బిట్ మాల్లోనే ఎక్కువగా ఉంటాను. నాకున్న డైట్ పరిమితుల వల్ల బిర్యానీ ఎక్కువగా తినలేను కానీ.. బషీర్‌బాగ్ కేఫ్ బహార్ నా ఫేవరేట్ ఫుడ్ జాయింట్. ఎలాంటి నాన్ వెజ్ అయినా ఎక్కువగా అక్కడి నుంచి తెప్పించుకుంటా. ఇక రంజాన్ నెలలో బహార్ హలీమ్ ఒక్క రోజూ మిస్ కాను. మొదటి నుంచి కొత్తపేట సమీపంలోని అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరే ఉంటున్నాం. సిటీ ఎంత మారినా ప్రతీది మధుర జ్ఞాపకమే. - మొహమ్మద్ అబ్దుల్ హాదీ