ఆస్ట్రేలియా
డర్బన్: పేసర్ స్టార్క్ (5/34), స్పిన్నర్ లయన్ (3/50) ధాటికి ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 189 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. డివిలియర్స్ (71 నాటౌట్; 11 ఫోర్లు) మాత్రమే రాణించాడు.
ఓవర్‌నైట్ స్కోరు 225/5తో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 351 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్‡్ష (96; 13 ఫోర్లు, ఒక సిక్స్) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. కేశవ్ మహరాజ్ (5/123), ఫిలాండర్ (3/59) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment