Stark
-
అదిరిపోయే ఎలక్ట్రిక్ ట్రెక్కింగ్ బైక్ (ఫొటోలు)
-
నాకు క్రికెట్ తెలియదు: బ్రెండన్ స్టార్క్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ సోదరుడు బ్రెండన్ స్టార్క్ హైజంప్ ఆటగాడు. గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో అతను 2.32 మీటర్లతో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం గెలిచాడు. అన్న మిచెల్‌తో పాటు అతని భార్య అలీసా హీలీ కూడా పేరొందిన క్రికెటరే... కానీ తనకు మాత్రం క్రికెట్ సంగతులేవీ తెలియవంటున్నాడు బ్రెండన్. ‘నేనెప్పుడు క్రికెట్‌ను ఫాలో కాలేదు. అది నా సోదరుడి ఆట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడానేమో కానీ... ఇప్పుడైతే నాకు సంబంధం లేని ఆట అది’ అని 24 ఏళ్ల బ్రెండన్ స్టార్క్ అన్నాడు. -
దక్షిణాఫ్రికా 162 ఆలౌట్
డర్బన్: పేసర్ స్టార్క్ (5/34), స్పిన్నర్ లయన్ (3/50) ధాటికి ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 189 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. డివిలియర్స్ (71 నాటౌట్; 11 ఫోర్లు) మాత్రమే రాణించాడు. ఓవర్‌నైట్ స్కోరు 225/5తో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 351 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్‡్ష (96; 13 ఫోర్లు, ఒక సిక్స్) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. కేశవ్ మహరాజ్ (5/123), ఫిలాండర్ (3/59) రాణించారు. -
ఆస్ట్రేలియాకు అనూహ్య షాక్
గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్న స్టార్క్ జట్టు అవకాశాలపై ప్రభావం రాంచీ: భారత్ చేతిలో రెండో టెస్టులో ఓటమితో పాటు రివ్యూ వివాదంతో మానసికంగా కుంగిపోయిన ఆస్ట్రేలియాకు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రధాన పేసర్, ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడైన మిషెల్ స్టార్క్ గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. కుడి కాలులో ఫ్రాక్చర్ కారణంగా అతను తప్పుకుంటున్నట్లు ఆసీస్ జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. బెంగళూరు టెస్టు సమయంలోనే గాయమైనా స్టార్క్ ఆటను కొనసాగించాడు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో శుక్రవారం స్కానింగ్ నిర్వహించడంతో ఫ్రాక్చర్ విషయం బయట పడింది. ‘స్టార్క్ కాలికి అయిన గాయం మేం ఆశించిన విధంగా కొద్ది రోజుల్లో తగ్గిపోలేదు. దాంతో ఇక తర్వాతి మ్యాచ్‌లు ఆడలేడని అర్థమైంది. చికిత్స కోసం అతను స్వదేశం తిరిగి వెళుతున్నాడు’ అని ఆసీస్ ఫిజియోథెరపిస్ట్ డేవిడ్ బీక్లే వెల్లడించారు. రెండు రోజుల క్రితమే ఆసీస్ ఆల్‌రౌండర్ మిషెల్ కూడా గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్‌లోని స్పిన్ పిచ్‌లపై కూడా తమ ప్రధానాస్త్రంగా స్టార్క్‌ను నమ్ముకొనే ఆస్ట్రేలియా భారత్‌లో అడుగు పెట్టింది. దానికి తగినట్లుగా అతను కూడా తన పేస్‌తో రెండు టెస్టులలో ప్రభావం చూపించాడు. పుణే టెస్టులో బ్యాటింగ్‌లో కూడా చెలరేగి స్టార్క్ అర్ధ సెంచరీ చేయడం కూడా జట్టు విజయానికి కారణమైంది. మరోవైపు స్టార్క్ స్థానంలో మరే ఆటగాడి పేరు కూడా ఆస్ట్రేలియా ప్రకటించలేదు. సిరీస్‌లో పాల్గొంటున్న ప్రస్తుత జట్టులో రిజర్వ్ పేసర్‌గా జాక్సన్ బర్డ్ ఉన్నాడు. అయితే దేశవాళీలో రాణిస్తున్న చాడ్ సాయెర్స్, జాసన్ బెహ్రన్‌డార్ఫ్, ప్యాట్ కమిన్స్ పేర్లను కూడా జట్టు పరిశీలిస్తోంది. స్టార్క్ లేకపోవడం ఆసీస్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. ‘ఆసీస్ జట్టుకు స్టార్క్ ప్రధాన బలం. అతను లేనట్లయితే జట్టుపై చాలా ప్రభావం పడుతుంది. ఇకపై సిరీస్‌లో ఆసీస్ పరిస్థితి మరింత కఠినంగా మారబోతోంది’ అని క్లార్క్ అన్నారు. -
పిచ్ ఎవరి వైపు..?
-
పిచ్ ఎవరి వైపు..?
► బెంగళూరు వికెట్‌పై తీవ్ర చర్చ ►రెండు రోజుల ముందు పచ్చిక తొలగింపు ► బ్యాటింగ్‌పైనే భారత్ దృష్టి బెంగళూరు: భారత గడ్డపై టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆటకు ముందే పిచ్ ఎలా ఉండబోతోందో అనే చర్చ మరో సారి మొదలైంది. అయితే ఈ సారి సీన్ కాస్త రివర్స్‌గా ఉంది. ఎప్పుడైనా ప్రత్యర్థి జట్లు పిచ్ గురించి ఆందోళన చెందేవి. భారత్‌కు మాత్రం అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే రాలేదు. కానీ పుణే టెస్టు మ్యాచ్ దెబ్బకు టీమిండియా కూడా వికెట్‌పై దృష్టి పెడుతోంది. ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్ 4–0తో గెలిచినా పిచ్‌ల ఏర్పాటు విషయంలో ఎలాంటి వివాదం రేకెత్తలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పిచ్ ఎవరికి అనుకూలిస్తుందనేది ఆసక్తికరం. శనివారం ప్రారంభం కానున్న భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టుకు మూడు రోజుల ముందు ప్రధాన వికెట్‌పై చాలా ఎక్కువగా పచ్చిక కనిపించింది. అదే సమయంలో ఒక ఎండ్‌లో ఆఫ్ స్టంప్‌కు చేరువలో (ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు) వికెట్ కాస్త ఎత్తుపల్లాలతో ఉంది. ఇది భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు అనుకూలంగా మారవచ్చని భావిస్తున్నారు. అయితే మరో వైపు అదనపు పేస్‌తో ఇది ఆసీస్ స్టార్ మిషెల్ స్టార్క్‌కు కూడా కలిసి వచ్చే ప్రమాదం కనిపించింది. దాంతో గురువారంనాటికి పిచ్ మారిపోయింది. పిచ్‌పైనున్న పచ్చికను దాదాపు పూర్తిగా తొలగించేశారు. ఇప్పుడు ఇది సాధారణ ఉపఖండపు వికెట్లా కనిపించడం విశేషం. అంటే తొలి రెండు రోజుల్లో బ్యాటిం గ్‌కు బాగా అనుకూలించి ఆ తర్వాత మెల్లగా స్పిన్‌కు సహకరించవచ్చు. ఈ సీజన్లో భారత జట్టు ఇంగ్లండ్‌తో ఆడిన ఐదు టెస్టులు, బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో ఇలాంటి పిచ్‌లపైనే ముందుగా భారీ స్కోరు సాధించి ఆ తర్వాత ప్రత్యర్థిని చుట్టేసింది. ఈ ఆరు టెస్టుల తొలి ఇన్నింగ్స్‌లలో భారత్ వరుసగా 488, 455, 417, 631, 759/7, 687/6 పరుగులు చేయడం విశేషం. కాబట్టి ఈ సారి కూడా టాస్ కీలకం కానుంది. పూర్తి స్పిన్ పిచ్ లేదా పేస్ వికెట్ ఉపయోగించి సాహసం చేసే పరిస్థితిలో భారత్ ప్రస్తుతం లేదు. కాబట్టి ముందుగా తమ బలమైన బ్యాటింగ్‌నే నమ్ముకోవాలని జట్టు భావిస్తున్నట్లుంది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు గనుక చేయగలిగితే జట్టుకు టెస్టుపై పట్టు చిక్కవచ్చు. స్టార్క్ మా బలం: మార్ష్ భారత గడ్డపై స్టార్క్‌లాంటి పేస్ బౌలర్ ప్రభావం చూపించడం మంచి పరిణామమని అతని సహచరుడు, ఆసీస్ ఆల్‌రౌండర్ మిషెల్ మార్ష్ అభిప్రాయ పడ్డాడు. భారత ఆటగాళ్లలో ఒక రకమైన ఆందోళనను స్టార్క్ పెంచాడని అతను అన్నాడు. ‘స్టార్క్ ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. స్పిన్నర్ల గురించి చర్చ జరిగే భారత్‌లో స్టార్క్ మా ప్రధాన ఆయుధం. భారత బ్యాట్స్‌మెన్‌లో భయం పుట్టించి అతను మరిన్ని వికెట్లు తీస్తాడని నమ్ముతున్నా. స్టార్క్‌తో పాటుహాజల్‌వుడ్ రివర్స్ స్వింగ్ కలిస్తే మాకు తిరుగుండదు’ అని మార్ష్ విశ్వాసం వ్యక్తం చేశాడు. గురువారం భారత జట్టుకు ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో ప్రధాన ఆటగాళ్లంతా సెషన్‌కు దూరంగా ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు మాత్రం పూర్తిస్థాయిలో సాధన చేసింది.