
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ సోదరుడు బ్రెండన్ స్టార్క్ హైజంప్ ఆటగాడు. గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో అతను 2.32 మీటర్లతో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన కనబరిచి స్వర్ణం గెలిచాడు. అన్న మిచెల్‌తో పాటు అతని భార్య అలీసా హీలీ కూడా పేరొందిన క్రికెటరే... కానీ తనకు మాత్రం క్రికెట్ సంగతులేవీ తెలియవంటున్నాడు బ్రెండన్.
‘నేనెప్పుడు క్రికెట్‌ను ఫాలో కాలేదు. అది నా సోదరుడి ఆట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడానేమో కానీ... ఇప్పుడైతే నాకు సంబంధం లేని ఆట అది’ అని 24 ఏళ్ల బ్రెండన్ స్టార్క్ అన్నాడు.