పరిశోధకుల విశ్వాసం
జెనీవా: ఏ జట్టు ఫలితాలు ఎలా ఉన్నా ఈసారి సాకర్ ప్రపంచకప్‌ను డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ నిలబెట్టుకుంటుందని పరిశోధకులు బలంగా విశ్వసిస్తున్నారు. జట్టులో ఉన్న అంతర్గత నైపుణ్యాల ఆధారంగా దీన్ని అంచనా వేస్తున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన సీఐఈఎస్ అనే ఫుట్‌బాల్ పరిశోధన సంస్థ... ప్రస్తుతం టోర్నీలో పాల్గొంటున్న 32 జట్ల గురించి చాలా లోతుగా విశ్లేషణలు చేసి పోటీల ఊహాత్మక ఫలితాలను వెల్లడించింది. ఫైనల్లో స్పెయిన్... బ్రెజిల్‌ను ఓడించడంతో పాటు అర్జెంటీనాకు మూడో స్థానం, ఫ్రాన్స్‌కు నాలుగో స్థానం లభిస్తుందని లెక్కలు కట్టింది. మ్యాచ్‌కు సంబంధించిన అన్ని అంశాలను ఎకనోమెట్రిక్ పద్ధతుల ఆధారంగా గణించి విస్తృతమైన డేటాను తయారు చేసింది.
ప్రతి ఆటగాడి కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లు, చేసిన గోల్స్, గత రెండేళ్లలో వాళ్ల ప్రదర్శన, ఇప్పటి వరకు ఆడిన ప్రపంచకప్‌లను పరిగణనలోకి తీసుకుని దీన్ని తయారు చేసింది. ఈ డేటాను మొత్తం విశ్లేషించి ప్రిక్వార్టర్స్‌లో బ్రెజిల్... నెదర్లాండ్స్‌పై; ఇటలీ.. జపాన్‌పై; ఫ్రాన్స్... నైజీరియాపై; పోర్చుగల్... రష్యాపై; స్పెయిన్... క్రొయేషియాపై; ఇంగ్లండ్.. కొలంబియాపై; అర్జెంటీనా... ఈక్వేడార్‌పై; జర్మనీ.. బెల్జియంపై గెలిచి క్వార్టర్స్‌కు చేరుకుంటాయని అంచనా వేసింది. ఇక క్వార్టర్స్‌లో బ్రెజిల్.. ఇటలీపై; ఫ్రాన్స్.. పోర్చుగల్‌పై; స్పెయిన్.... ఇంగ్లండ్‌పై; అర్జెంటీనా... జర్మనీపై గెలిచి సెమీస్ చేరుతాయని విశ్లేషించింది. సెమీస్‌లో బ్రెజిల్... ఫ్రాన్స్‌ను; స్పెయిన్... అర్జెంటీనాను ఓడిస్తుందని స్పష్టం చేసింది. గ్రూప్-సి, జిలో బాగా పోటీ ఉంటుందని కూడా ఈ సంస్థ తేల్చింది.
స్పెయిన్‌దే ప్రపంచకప్!
Published Fri, Jun 13 2014 2:19 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM
Advertisement
Advertisement