
ఎదురీదుతున్నశ్రీలంక
ఢిల్లీ:వరల్డ్ టీ 20లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక ఎదురీదుతోంది. ఇంగ్లండ్ విసిరిన 172 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శ్రీలంక ఆటగాళ్లలో చండీమల్(1), దిల్షాన్(2),సిరివర్ధనే(7), తిరుమన్నే(3)లు తీవ్రంగా నిరాశపరిచి పెవిలియన్ కు చేరారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే రెండు వికెట్లు తీయగా, జోర్డాన్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే నేరుగా సెమీస్ లోకి ప్రవేశిస్తుంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జాసన్ రాయ్(42; 39 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్(66 నాటౌట్;37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో పాటు, జో రూట్(25), కెప్టెన్ మోర్గాన్(22) లు ఫర్వాలేదనిపించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.