ఢిల్లీ: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరుగుతన్న మ్యాచ్లో ఇంగ్లండ్ 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆదిలో హేల్స్(0) వికెట్ ను నష్టపోయింది. అయితే మరో ఓపెనర్ జాసన్ రాయ్(42; 39 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జో రూట్(25) ఫర్వాలేదనిపించడంతో ఇంగ్లండ్ పరిస్థితి కుదుటపడింది.
ఆ తరువాత బట్లర్(66 నాటౌట్;37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. అతనికి కెప్టెన్ మోర్గాన్(22) సహకారం అందించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో వాండర్ సేకు రెండు వికెట్లు లభించాయి.