ఢిల్లీ: వరల్డ్ టీ 20లో భాగంగా గ్రూప్-1లో శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధిస్తే నేరుగా సెమీస్కు చేరుతుంది. ఇప్పటికే ఇంగ్లండ్ రెండు విజయాలు సాధించడంతో మూడో విజయం కోసం ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు పెద్దగా ఫామ్ లో శ్రీలంక టోర్నీలో ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచి సెమీస్ ఆశలను దాదాపు క్లిష్టం చేసుకుంది. ఈ గ్రూప్‌లో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే... దక్షిణాఫ్రికా జట్టు ఇంటికి వెళుతుంది.