సాధించాల్సింది చాలా ఉంది:రోహిత్ శర్మ | Still have lots to achieve, says Rohit after record double ton | Sakshi
Sakshi News home page

సాధించాల్సింది చాలా ఉంది:రోహిత్ శర్మ

Published Fri, Nov 14 2014 1:07 PM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

సాధించాల్సింది చాలా ఉంది:రోహిత్ శర్మ

సాధించాల్సింది చాలా ఉంది:రోహిత్ శర్మ

కోల్ కతా: ప్రపంచ క్రికెట్ లో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. గురువారం నాటి నాల్గో వన్డేలో డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డులను తిరగరాసిన రోహిత్.. తాజాగా తాను ఆడిన ఇన్నింగ్స్ తనపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందన్నాడు. తన కెరీర్ లో మరిన్ని లక్ష్యాలను అధిగమించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. టీమిండియా ఘనవిజయం సాధించిన అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. ఈ రికార్డు వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నాడు. తాను యువకుడిగా ఉన్నప్పుడే అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఆడాలనుకున్నానని సృష్టం చేశాడు.

 

ఇదిలా ఉండగా తన పునరాగమంలో జట్టు ఫిజియో వైభవ్ దాగా కృషి మరువలేనిదని రోహిత్ తెలిపాడు. ఆస్ట్రేలియన్లు మంచి క్రికెట్ ఆడతారని, ఆస్ట్రేలియి పర్యటనకు భారత్ కు పెద్ద సవాల్ అని పేర్కొన్నాడు. తాను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలో టీం మేనేజ్ మెంట్ నిర్ణయిస్తుందన్నాడు. జట్టు ప్రయోజనాలకు తనకు ముఖ్యమని రోహిత్ స్పష్టం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement