మహి ఔటై వస్తుంటే... కన్నీళ్లు ఆగలేదు | Struggled To Hold Back My Tears When Dhoni got out in World Cup | Sakshi
Sakshi News home page

మహి ఔటై వస్తుంటే... కన్నీళ్లు ఆగలేదు

Published Sun, Sep 29 2019 10:10 AM | Last Updated on Sun, Sep 29 2019 5:34 PM

Struggled To Hold Back My Tears When Dhoni got out in World Cup - Sakshi

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమైందని  స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ అన్నాడు. ‘ఇండియా టుడే మైండ్‌రాక్స్‌ యూత్‌ సమ్మిట్‌’లో చహల్‌ మాట్లాడుతూ... ‘జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఎంఎస్‌ ధోని చివర్లో రనౌటయ్యాడు. అతడు వెనుదిరిగి వస్తుంటే నేను బ్యాటింగ్‌కు వెళ్తున్నా. ఆ సమయంలో నా కన్నీటిని ఆపుకొనేందుకు ఎంతగానో కష్టపడ్డా. ఆ పరాజయం నన్ను నైరాశ్యంలోకి నెట్టింది. 

ఆ మ్యాచ్‌ను వర్షం శాసించింది. ఆ పరాభవంతో గ్రౌండ్‌లో ఎక్కువసేపు ఉండలేకపోయాం’ అని వివరించాడు. ధోని ఔటైన క్షణంలో తమ ఓటమి ఖరారైనట్లు చహల్‌ తెలిపాడు. ప్రపంచకప్‌ లీగ్‌ దశలో టాప్‌లో నిలిచి సెమీస్‌లోనే ఇంటిదారి పట్టడం ఎక్కువ బాధించిందని వివరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement