బీసీసీఐకి ఎదురుదెబ్బ | Supreme Court refuses to stay court order on Meiyappan, Kundra | Sakshi
Sakshi News home page

బీసీసీఐకి ఎదురుదెబ్బ

Published Thu, Aug 8 2013 2:33 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Supreme Court refuses to stay court order on Meiyappan, Kundra

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్పాట్ ఫిక్సింగ్‌పై బీసీసీఐ నియమించిన ద్విసభ్య కమిటీ విషయమై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే ఈ పిటీషన్‌ను విచారించేందుకు మాత్రం సుప్రీం కోర్టు సమ్మతించింది. ఐపీఎల్ బెట్టింగ్ ఉదంతంలో చెన్నై ఫ్రాంచైజీ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్‌కుంద్రాలపై బోర్డు నియమించిన ద్విసభ్య కమిటీ వీరిద్దరికి క్లీన్‌చిట్ ఇచ్చింది.
 
 అయితే ఈ దర్యాప్తుతో నిజానిజాలు వెలుగులోకి రావని బీహార్ క్రికెట్ సంఘం కేసు వేసింది. దీన్ని విచారించిన బాంబే హైకోర్టు ఆ కమిటీ అనైతికమని, రాజ్యాంగబద్ధమైనది కాదని తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూ... మధ్యంతర తీర్పు వెలువరించాలని బోర్డు కోరింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం ‘స్టే’కు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని ప్రతివాది అయిన బీహార్ క్రికెట్ సంఘాన్ని ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement