ట్రిఫుల్, డబుల్ సెంచరీలతో రికార్డు బద్దలు | Swapnil Gugale, Ankit Bawne of Maharashtra break Ranji record of highest run partnership | Sakshi
Sakshi News home page

ట్రిఫుల్, డబుల్ సెంచరీలతో రికార్డు బద్దలు

Published Fri, Oct 14 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

ట్రిఫుల్, డబుల్ సెంచరీలతో రికార్డు బద్దలు

ట్రిఫుల్, డబుల్ సెంచరీలతో రికార్డు బద్దలు

ముంబై: మహారాష్ట్ర క్రికెటర్లు స్వప్నిల్ గుగాలే, అంకిత్ బావ్నే సరికొత్త రికార్డు సృష్టించారు. రంజీ క్రికెట్ లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసి పాత రికార్డులను చెరివేశారు. ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో స్వప్నిల్, అంకిత్ కలిసి 594 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. రంజీ క్రికెట్ చరిత్రలో ఏ వికెట్ కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. స్వప్నిల్ ట్రిఫుల్, అంకిత్ డబుల్ సెంచరీలతో పరుగుల వరద పారించారు.

41 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన మహారాష్ట్ర వీరిద్దరి విజృంభణతో భారీ స్కోరు చేసింది. స్వప్నిల్(351; 521 బంతుల్లో 37 ఫోర్లు, 5 సిక్సర్లు), అంకిత్(258; 500 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరిద్దరీని అవుట్ చేసేందుకు ఢిల్లీ బౌలర్లు విఫలయత్నం చేశారు. 635/2 స్కోరు వద్ద మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement