ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ జట్టు అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. దబంగ్ ముంబై జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్ 5-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. వారియర్స్ జట్టుకు పెనాల్టీ కార్నర్‌ల ద్వారా వరుణ్ కుమార్ (2వ నిమిషంలో), మార్క్ గ్లెగ్‌హార్న్ (13వ నిమిషంలో), క్రిస్టోఫర్ సిరియెలో (25వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించగా... 40వ నిమిషంలో నితిన్ తిమ్మయ్య ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం) సాధించాడు. ముంబై జట్టు తరఫున జెరెమి హేవార్డ్ ఏకైక గోల్ చేశాడు. ప్రసుత్తం వారియర్స్, రాంచీ రేస్ 27 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నా, మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా వారియర్స్ జట్టు ‘టాప్’లోకి వచ్చింది.
పట్నా ఘనవిజయం
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 47-34 తేడాతో దబాంగ్ ఢిల్లీపై ఘనవి జయం సాధించింది. దీంతో ఈ జట్టు 33 పాయింట్లతో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. దీపక్ నర్వాల్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి 13 రైడ్, 2 టాకిల్ పాయింట్లు సాధిం చగా పర్‌దీప్ నర్వాల్ 11 రైడ్ పాయింట్లు సాధించాడు. ఢిల్లీ నుంచి సుర్జీత్ సింగ్ (10) మెరుగ్గా రాణించాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 25-22 తేడాతో పుణెరి పల్టన్‌ను ఓడించింది. పుణె నుంచి అజయ్ ఠాకూర్ (11) రాణించాడు.
‘టాప్’లోకి వారియర్
Published Sat, Feb 13 2016 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM
Advertisement
Advertisement