సింగపూర్ ఫ్రాంచైజీలో వాటా కొనుగోలు
లండన్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ టెన్నిస్‌లో అడుగు పెడుతున్నారు. మహేశ్ భూపతి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో సింగపూర్ ఫ్రాంచైజీలో గవాస్కర్ వాటా కొనుగోలు చేశారు. ఈ మేరకు గత సోమవారమే ఫ్రాంచైజీతో ఒప్పందం కుదిరినట్లు ద డైలీ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. సింగపూర్ ఫ్రాంచైజీకి సెరెనా విలియమ్స్, ఆండ్రీ అగస్సీ, థామస్ బెర్డిచ్ వంటివారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాఫెల్ నాదల్, జొకోవిచ్, ముర్రే, అజరెంకా, ఇవనోవిక్‌లతోపాటు మాజీలు అగస్సీ, సంప్రాస్, పాట్రిక్ రాఫ్టర్, కార్లోస్ మోయాలు కూడా ఈ లీగ్‌లో పాలుపంచుకోనున్నారు. సింగపూర్, మనీలా, ముంబై, దుబాయ్‌లలో నవంబర్, డిసెంబర్‌లలో ఈ లీగ్ జరగనుంది.
టెన్నిస్ లీగ్‌లో గవాస్కర్
Published Fri, Jun 20 2014 1:08 AM | Last Updated on Wed, Oct 3 2018 7:16 PM
Advertisement
Advertisement