
భారత గడ్డపై తొలి మ్యాచ్ కు ఫెదరర్ సిద్ధం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్(ఐపీటీఎల్)లో భాగంగా టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్(33) భారత్ కు చేరుకున్నాడు. పదిహేడు గ్రాండ్ స్లామ్ లు గెలిచిన ఫెదరర్ భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నసంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే డిసెంబర్ 6 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకూ భారత్ లో ఐపీటీఎల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. భారత గడ్డపై తొలి మ్యాచ్ ను ఆడుతుండట పట్ల ఫెదరర్ సంతోషంగా వ్యక్తం చేశాడు.
తాను భారత్ కు చేరుకున్నట్లు ఫెదరర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ సందర్భంగా 14 గ్రాండ్ స్లామ్ లు గెలిచిన పీట్ సంప్రాస్ తో కలసి ఉన్న ఒక స్మైలింగ్ ఫోటోను పోస్ట్ చేశాడు. భారత టీం నుంచి ఫెదరర్ తో పాటు, పీట్ సాంప్రస్, గ్యాల్ మోన్ ఫిల్స్, అనా ఇవానిక్, సానియా మీర్జా, రోహన్ బోపన్నా తదితరులు పాల్గొంటున్నారు. నవంబరు 28 వ తేదీన ఆరంభమైన ఈ టోర్నీ.. మనాలీయా, సింగపూర్, దుబాయ్ దేశాలతో పాటు భారత్ లో జరుగుతోంది.