సచిన్‌ను మళ్లీ కలుస్తా! | Roger Federer is hoping to meet Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

సచిన్‌ను మళ్లీ కలుస్తా!

Published Tue, Sep 30 2014 7:40 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

సచిన్‌ను మళ్లీ కలుస్తా!

సచిన్‌ను మళ్లీ కలుస్తా!

న్యూఢిల్లీ: టెన్నిస్ సూపర్ స్టార్ రోజర్ ఫెడరర్ మరోసారి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలవాలని భావిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో భారత్‌కు రానున్న ఫెడరర్, తనకున్న కొద్దిపాటి సమయంలో సచిన్‌తో భేటీ కావాలనుకుంటున్నట్లు రోజర్ ఏజెంట్ టోనీ గాడ్‌సిక్ వెల్లడించారు. ‘గతంలో వింబుల్డన్ సందర్భంగా వీరిద్దరు రెండు సార్లు కలిశారు. ఇప్పుడు కూడా అతను సచిన్‌తో ముచ్చటించాలని అనుకుంటున్నాడు. ఫెడరర్‌కు కూడా క్రికెట్‌పై కూడా ఆసక్తి ఉంది. అతని తల్లి దక్షిణాఫ్రికా జాతీయురాలు కావడంతో పాటు, తొలి కోచ్ ఆస్ట్రేలియా వ్యక్తి కావడం రోజర్‌కు క్రికెట్ గురించి తెలుసుకునేలా చేసింది’ అని టోనీ తెలిపాడు
 

త్వరలో ఆరంభం కానున్న అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్(ఐపీటీఎల్)కు భారత్ ఏస్ కు ఏడుసార్లు గ్రాండ్ స్లామ్ విజేత రోజర్ ఫెదరర్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. రఫెల్ నాదల్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఆ అవకాశం ఫెదరర్ ను వరించింది.నవంబరు 28 వ తేదీన ఆరంభం కానున్న ఈ టోర్నీ.. మనాలీయా, సింగపూర్, దుబాయ్ దేశాల్లో జరుగునుంది. భారత్ లో డిసెంబర్ 6-8 తేదీల మధ్య జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement