ఐపీటీఎల్ లో భారత్ కు ఫెదరర్ ప్రాతినిధ్యం | Federer to lead Indian franchise of IPTL | Sakshi
Sakshi News home page

ఐపీటీఎల్ లో భారత్ కు ఫెదరర్ ప్రాతినిధ్యం

Published Mon, Sep 22 2014 6:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

ఐపీటీఎల్ లో భారత్ కు ఫెదరర్ ప్రాతినిధ్యం

ఐపీటీఎల్ లో భారత్ కు ఫెదరర్ ప్రాతినిధ్యం

న్యూఢిల్లీ:త్వరలో ఆరంభం కానున్న అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్(ఐపీటీఎల్)కు భారత్ తరుపున  ఏడుసార్లు గ్రాండ్ స్లామ్ విజేత రోజర్ ఫెదరర్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇప్పటి వరకూ ఇండియన్ ఫ్రాంచైజీ తరుపున రఫెల్ నాదల్ బరిలోకి దిగుతాడని భావించినా..  అతను మోకాలి గాయం కారణంగా ఈ లీగ్ నుంచి నిష్క్రమించాడు. దీంతో ఆ అవకాశం రోజర్ ఫెదరర్ ను వరించింది. భారత్ తరుపున ఫెదరర్ బరిలో దిగుతున్నట్లు ఫ్రాంచైజీ మైక్రోమ్యాక్స్ సోమవారం స్పష్టం చేసింది.

 

భారత టీం నుంచి ఫెదరర్ తో పాటు, పీట్ సాంప్రస్, గ్యాల్ మోన్ ఫిల్స్, అనా ఇవానిక్, సానియా మీర్జా, రోహన్ బోపన్నా తదితరులు రంగంలో దిగనున్నారు. నవంబరు 28 వ తేదీన ఆరంభం కానున్న ఈ టోర్నీ.. మనాలీయా, సింగపూర్, దుబాయ్ దేశాల్లో జరుగునుంది. భారత్ లో డిసెంబర్ 6-8 తేదీల మధ్య జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement