అహ్మదాబాద్: హోరాహోరీ పోరులో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 27–24 స్కోరుతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. తొలి పది నిమిషాల్లో 11–3తో ఆధిక్యం కనబరిచిన బెంగళూరు బుల్స్ తొలి అర్ధభాగాన్ని 14–9తో ముగించింది. అయితే రెండో అర్ధభాగంలో గుజరాత్ అనూహ్యంగా పుంజుకోవడంతో మ్యాచ్ జరిగే కొద్దీ ఉత్కంఠ పెరిగింది. రైడర్లు వరుసగా పాయింట్లు చేయడంతో ఈ టోర్నీలో గుజరాత్ ఐదో విజయాన్ని సాధించింది.
టాకిల్‌లో పర్వేశ్ (4) ఆకట్టుకున్నాడు. టాకిల్ చేసిన నాలుగు సార్లు పాయింట్లు తెచ్చిపెట్టాడు. రైడింగ్‌లో సచిన్ (4), రోహిత్ గులియా (4), సునీల్ కుమార్ (3) రాణించారు. అంతకుముందు జరిగిన పోరులో పుణేరి పల్టాన్ 34–17తో బెంగాల్ వారియర్స్‌పై అలవోక విజయం సాధించింది. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో హర్యానా స్టీలర్స్‌తో తమిళ్ తలైవాస్, గుజరాత్ జెయింట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లను ‘స్టార్ స్పోర్ట్స్–2’ చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
గుజరాత్ జెయింట్స్ ఖాతాలో ఐదో గెలుపు
Published Wed, Aug 16 2017 12:28 AM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM
Advertisement
Advertisement