చివరి రోజు కూడా పతకాల వేట కొనసాగించిన భారత రెజ్లర్లు ఆసియా క్యాడెట్ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచారు.
న్యూఢిల్లీ : చివరి రోజు కూడా పతకాల వేట కొనసాగించిన భారత రెజ్లర్లు ఆసియా క్యాడెట్ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచారు. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో ఆఖరి రోజు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. బాలికల 70 కేజీల విభాగం ఫైనల్లో దివ్య కక్రాన్ 3-2తో బ్యామ్‌బదోర్జ్ సెట్సెబాయెర్ (మంగోలియా)పై విజయం సాధించి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. బాలుర గ్రీకో రోమన్ విభాగంలో దీపక్ (85 కేజీలు), సుమీత్ (100 కేజీలు)... ఫ్రీస్టయిల్ విభాగంలో మోను (46 కేజీలు) కాంస్య పతకాలను గెల్చుకున్నారు. బాలుర ఫ్రీస్టయిల్ విభాగంలో 74 పాయింట్లతో, బాలికల విభాగంలో 80 పాయిం ట్లతో భారత జట్లు రన్నరప్‌గా నిలిచాయి.