
'కోహ్లికి ఇదొక మంచి ఛాన్స్'
ఉపఖండపు ఆటగాళ్లు ఇంగ్లండ్ పిచ్లపై పెద్దగా రాణించలేరనే వాదనతో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ విభేదించాడు.
న్యూఢిల్లీ: ఉపఖండపు ఆటగాళ్లు ఇంగ్లండ్ పిచ్లపై పెద్దగా రాణించలేరనే వాదనతో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ విభేదించాడు. ఉపఖండపు ఆటగాళ్లు ఇక్కడ బాగా ఆడలేరని ఎవరైతే అనుకుంటున్నారో అది కచ్చితంగా తప్పని నిరూపించబడుతుందని అజహరుద్దీన్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ లోని పిచ్ లపై బంతి గమనాన్ని అంచనా వేయడం ఉపఖండపు ఆటగాళ్లకు కష్టమనడం ఎంతమాత్రం సరికాదన్నాడు.గతంలో ఇక్కడ పెద్దగా మంచి ఇన్నింగ్స్ లు లేని విరాట్ కోహ్లి లాంటి స్టార్ ఆటగాడికి ఇదొక మంచి ఛాన్స్ గా అజహర్ పేర్కొన్నాడు.
'విరాట్ కోహ్లికి ఇదొక మంచి ఛాన్స్. గత ఇంగ్లండ్ పర్యటనను విరాట్ ఒకసారి గుర్త్తుకు తెచ్చుకుంటే, ఇక్కడ కచ్చితంగా సత్తాచూపెట్టాలనే అనుకుంటాడు. ఇంగ్లిష్ పిచ్ లపై బంతి గమనాన్ని ఉపఖండపు ఆటగాళ్లు సరిగా అంచనా వేయలేరని బయట దేశాల ప్రజల అభిప్రాయం. ఉపఖండపు ఆటగాళ్లు ఇక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఆడలేరనేది వాస్తవం కాదు. ఈ పిచ్ లపై రాణించి తన కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి విరాట్ ఇదొక మంచి ఛాన్స్' అని అజహర్ అభిప్రాయపడ్డాడు.