![Virat Kohli, Anushka Sharma Show Off Their Dancing Skills At Zaheer Khan's Reception - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/28/virat1.jpg.webp?itok=iZXtOawO)
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సాగరికను మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇటీవల పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ రిసెప్షన్ సోమవారం సాయంత్రం ముంబైలోని తాజ్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు క్రికెట్ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. జహీర్ ఖాన్ రాయల్ బ్లూ డ్రెస్ ధరించగా, సాగరిక గోల్డెన్ బెనారసి లెహంగాలో అందంగా మెరిసిపోయింది. అయితే ఈ వేడుకలో ప్రేమ పక్షులు విరాట్ కోహ్లి-అనుష్క శర్మలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ డ్యాన్స్‌తో అక్కడకొచ్చిన వారిని ఆనందంలో ముంచెత్తారు. ప్రస్తుతం వారిద్దరూ అదరగొట్టిన డ్యాన్స్ ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తుంది.
ఈ వేడుకకు పలువురు ప్రముఖ క్రికెటర్లు హాజరయ్యారు.ప్రధానంగా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు యువరాజ్ సింగ్ తన భార్య హజల్‌కీచ్‌తో కలిసి హాజరయ్యాడు. వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్, సానియా మీర్జా, అజిత్ అగార్కర్ తదితరులు జహీర్ రిసెప్షన్‌కు హాజరైన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment