విరాట్ కోహ్లి
అడిలైడ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లిసేన 31 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల్లో కనీసం ఒక టెస్ట్ విజయం సాధించిన తొలి ఆసియా సారథిగా కోహ్లి చరిత్రకెక్కాడు. అంతేకాకుండా ఆసీస్ గడ్డపై సిరీస్ ఆరంభ మ్యాచ్ గెలిచిన భారత కెప్టెన్‌గా.. జట్టుగా అద్భుత ఫీట్‌ను సాధించారు. గతంలో భారత్ ఆసీస్ గడ్డపై ఐదు మ్యాచ్‌లు నెగ్గినప్పటికి ఎప్పుడు తొలి మ్యాచ్‌ను గెలవలేదు. 2008 పెర్త్ టెస్ట్ విజయానంతరం భారత్ ఆసీస్ గడ్డపై గెలుపొందడం విశేషం.
ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత్ తొలి రెండు టెస్ట్‌లు ఓడి సిరీస్ చేజార్చుకున్నప్పటికి చివరి జోహన్నస్ బర్గ్ మ్యాచ్ గెలిచింది. ఈ సిరీస్‌లో కోహ్లి 6 ఇన్నింగ్స్‌ల్లో 47.67 సగటుతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అలాగే ఇంగ్లండ్ సిరీస్‌లోను తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన కోహ్లిసేన నాటింగ్‌హోమ్ టెస్ట్‌ను గెలిచింది. అనంతరం ఇంగ్లండ్ మరో రెండు మ్యాచ్‌లు గెలిచి 4-1 సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2014లో ఇంగ్లండ్ గడ్డపై దారుణంగా విఫలమైన కోహ్లి.. ఈ సిరీస్ తన సత్తా చాటాడు. 10 ఇన్నింగ్స్‌లో 59.3 సగటుతో 593 పరుగలు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించకపోవడంతో భారత్ సిరీస్‌ను కోల్పోయింది. అయితే ఆసీస్‌తో తాజా సిరీస్‌లో కోహ్లి బ్యాట్ మెరవకపోయినప్పటికీ.. పుజారా అద్భుత బ్యాటింగ్‌కు బౌలర్లు రాణించడంతో భారత్ విజయాన్నందుకుంది.
టాస్ గెలిస్తే విజయం కోహ్లిదే..
విరాట్ కోహ్లి టాస్ గెలిస్తే.. మ్యాచ్ భారతే నెగ్గుతుంది. ఇప్పటి వరకు కోహ్లి సారథ్యం వహించిన టెస్ట్ మ్యాచ్‌ల్లో 20 సార్లు టాస్ గెలవగా.. ఇందులో భారత్‌ను 17 విజయాలు వరించాయి. మరో మూడు మ్యాచ్‌లు డ్రా అవ్వగా.. ఒక్క ఓటమి లేకపోవడం గమనార్హం. చదవండి: తొలి టెస్టులో టీమిండియా విజయం
Comments
Please login to add a commentAdd a comment