దీనికంతా అనుష్కానే కారణం! | Virat Kohli Credits Wife Anushka Sharma For Keeping Him Motivated | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 17 2018 8:43 AM | Last Updated on Sat, Feb 17 2018 4:12 PM

Virat Kohli Credits Wife Anushka Sharma For Keeping Him Motivated - Sakshi

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌ ట్రోఫీలతో కోహ్లి..

సాక్షి, స్పోర్ట్స్‌ : దక్షిణాఫ్రికా పర్యటనలో అద్బుత ఫామ్‌తో రాణించడానికి తన భార్య అనుష్క శర్మే కారణమని విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌లో కోహ్లి మూడు సెంచరీలు, ఒక ఆఫ్‌సెంచరీతో 558 పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అందుకున్న విషయం తెలిసిందే. చివరి వన్డే విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ..

‘మైదానం బయట నుంచి నాకు మద్దతుగా నిలిచినవారు కూడా నా ఫామ్‌కు కారణమే.. ముఖ్యంగా నా భార్యకు ఈ విషయంలో అధిక క్రెడిట్‌ దక్కుతుంది. ఈ పర్యటనలో తను నాకు ఎంతో మద్దతుగా నిలిచింది. . గతంలో ఆమెపై చాలా మంది విమర్శలు గుప్పించారు. నిరంతరం నాకు ప్రేరణగా నిలుస్తూ ముందుకెళ్లేలా చేస్తోంది. వ్యక్తిగత ప్రదర్శనతో కెప్టెన్‌గా విజయాలందుకోవడం గొప్ప అనుభూతి. ఇంకా నాకు ఎనిమిది నుంచి తొమ్మిదేళ్ల కెరీర్‌ ఉంది. అందుకే ప్రతీ రోజునూ ఆస్వాదించాలనుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉండి జట్టును నడిపిస్తుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను, జట్టు విజయాల కోసం నా వంతు 120 శాతం కృషి చేస్తాను’  అని కోహ్లీ తెలిపాడు.

స్పిన్నర్లు అద్భుతం
సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పొషించిన ఇద్దరు యువ స్పిన్నర్లును కోహ్లి కొనియాడాడు. ‘వారిద్దరు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా జోహన్నెస్‌బర్గ్‌ టెస్టు అనంతరం వారు జట్టులోకి వచ్చారు. అప్పటి నుంచి మా విజయ యాత్ర కొనసాగించాం. తొలి రెండు టెస్టుల ఓటమితో నిరాశ చెందాం. చివరి టెస్టు విజయానంతరం ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. టెస్టు సిరీస్‌ కోల్పోయినప్పుడు ఇక్కడే మీతోనే మాట్లాడా.. ఇప్పుడు వన్డే సిరీస్‌ గెలిచి మళ్లీ మీతోనే మాట్లాడుతున్నా. ఇది అత్యద్భుతమని ’కోహ్లి వ్యాఖ్యానించాడు. ఇంకా సిరీస్‌ అయిపోలేదని, టీ20 సిరీస్‌ను సైతం వదులుకోమని స్పష్టం చేశాడు.

ఇక మూడు టీ20ల సిరీస్‌ ఆదివారం జోహన్నెస్‌ బర్గ్‌ వేదికగా ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement