
దుబాయ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్రస్థానంతో 2019ను ముగించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అతను 887 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో నిలిచాడు. కోహ్లి సహచరుడు, వైస్‌కెప్టెన్ రోహిత్ (873) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల టెస్టుల్లోను విరాట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఈ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా రోహిత్ (2442 పరుగులు) లంక మాజీ ఓపెనర్ జయసూర్య (2387; 1997లో) 22 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. అయితే ఓవరాల్‌గా 2455 పరుగులతో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. ఈ రెండు రికార్డులు విండీస్ తో జరిగిన ఆఖరి వన్డేలో నమోదయ్యాయి.