సౌతాంప్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డుపై కన్నేశాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి సౌతాంప్టన్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుపై కోహ్లి గురిపెట్టాడు.
టెస్టుల్లో ఆరు వేల పరుగులు సాధించడానికి కోహ్లి ఆరు పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 69 టెస్టులాడిన విరాట్ కొహ్లీ 118 ఇన్నింగ్స్‌ల్లో 5994 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 120 ఇన్నింగ్స్‌ల్లో 6వేల పరుగుల మార్క్‌ని అందుకోగా కోహ్లీ కేవలం 119 ఇన్నింగ్స్‌ల్లోనే ఆరువేల పరుగుల మైలురాయిని అందుకోవడం ఖాయంగా కనబడుతోంది.
అంతర్జాతీయ టెస్టుల్లో అత్యంత వేగంగా అతికొద్ది ఇన్నింగ్స్‌ల్లోనే ఆరు వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆల్ టైమ్ గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్రాడ్‌మన్ కేవలం 68 ఇన్నింగ్స్‌లోనే టెస్ట్‌ల్లో ఆరువేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. భారత్ తరపున సునీల్ గావస్కర్ 117 ఇన్నింగ్స్‌లోనే ఆరువేల టెస్టు పరుగుల్ని సాధించి సచిన్ కంటే ముందున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment