అదో స్పైడర్‌మన్‌ స్టఫ్‌.. అనుకరించకండి: కోహ్లి | Virat Kohli Says De Villiers Catch Was Spiderman Stuff You Dont Do That | Sakshi
Sakshi News home page

Published Fri, May 18 2018 9:27 AM | Last Updated on Fri, May 18 2018 10:04 AM

Virat Kohli Says De Villiers Catch Was Spiderman Stuff You Dont Do That - Sakshi

బెంగళూరు : చావోరేవో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అద్భుత విజయంపై ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్‌ రేసులో నిలిచింది. ఈ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి మ్యాచ్‌లను ఇంతకు ముందు చూశాను. మ్యాచ్‌ కడవరకు ప్రశాంతంగా ఉన్నాను. బౌలర్లు ఏం చేయాలో అది చేశారు. గత రెండు మ్యాచ్‌లు మేం ఇలాగే గెలిచాం. ముంబై జట్టులా మా జట్టు విజయాలందుకుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలించింది. అయినా మా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ఇదే విధంగా గత మూడు మ్యాచుల్లో మా బౌలర్లు అండగా నిలిచారు. ఈ ఉత్సాహంతో రాజస్తాన్‌పై విజయం సాధిస్తాం. మొయిన్‌ అలీ అ‍ద్భుతంగా ఆడాడు.’’అని కోహ్లి తెలిపాడు.

డివిలియర్స్‌ క్యాచ్‌పై స్పందిస్తూ..‘‘ అది ఒక స్పైడర్‌మన్‌ స్టఫ్‌.. అలా ఎవరు అనుకరించకండి. అది కచ్చితంగా సిక్స్‌ అని నేను భావించా. కానీ ఏబీ అద్భుతంగా అందుకున్నాడు. అతని ఫీల్డింగ్‌ను నేను అనుకరిస్తున్నాను. హోంగ్రౌండ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌కు మద్దతు తెలిపిన అభిమానులందరికి కృతజ్ఞతలు’ అని కోహ్లి పేర్కొన్నాడు.

చూడండి : ఏబీ సెన్సేషనల్‌ క్యాచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement