విరాట్ కోహ్లి (ఫైల్ ఫొటో)
జైపూర్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఫిట్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా భావించే కోహ్లిపై ఆ విషయంలోనే కొన్ని వదంతులు చెక్కర్లు కొడుతున్నాయి. వీటిపై కోహ్లి స్పందిస్తూ ట్విటర్ వేదికగా అభిమానులకు వివరణ ఇచ్చాడు.
‘‘ప్రతి విషయాన్ని నాకు అంటగడుతూ.. నా ఫిట్‌నెస్‌పై తప్పుడు ఫొటోలను ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటికి నేటి మ్యాచ్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్‌లో సమాధానాలు తెలియజేస్తాను. ఇక నేను తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తాను. ఇంటి ఫుడ్‌నే తీసుకుంటాను. కనీసం చిప్స్ కూడా తినను. నా ఆరోగ్యం పట్ల మీ ఆందోళనను నేను అర్ధం చేసుకున్నాను. నేను పూర్తి ఫిట్‌నెస్‌గా ఉన్నాను. ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని కోహ్లి అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఇక ఐపీఎల్‌లో కోహ్లి సారథ్యం వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
— Virat Kohli (@imVkohli) May 20, 2018
Comments
Please login to add a commentAdd a comment