'ఆసీస్ రికార్డును బద్దలు కొడతాం'
కొలంబో: ఇటీవల శ్రీలంకతో ఇక్కడ జరిగిన రెండో టెస్టులో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 622/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో 29వ సారి ఆరొందల పరుగుల మార్కును భారత్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ ఘనతను భారత్ కంటే ఆసీస్ మూడుసార్లు అధికంగా సాధించి తొలిస్థానంలో కొనసాగుతోంది. టెస్టు క్రికెట్ లో ఆసీస్ జట్టు 32 సార్లు ఆరొందల పరుగుల మార్కును చేరి వరల్డ్ రికార్డును లిఖించుకుంది.
కాగా, ఈ రికార్డును బద్ధలు కొడతామని అంటున్నాడు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి.' ఆసీస్ వరల్డ్ రికార్డును అధిగమించటానికి స్వల్ప దూరంలో ఉన్నాం. ఆ రికార్డును కచ్చితంగా అధిగమిస్తాం. నా రెండేళ్ల పర్యవేక్షణలో ఆసీస్ సాధించిన రికార్డును భారత్ బద్దలు కొడుతుంది. కాకపోతే ఏ సమయంలోనే అనేది మాత్రం చెప్పలేను' రవిశాస్త్రి పేర్కొన్నాడు.