
నంబర్ వన్ స్థానంలోనే ప్లే ఆఫ్ కు..
ఐపీఎల్-8లో నంబర్ వన్ స్థానంలోనే ప్లే ఆఫ్ కు వెళ్లాలనుకుంటున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు.
చెన్నై: ఐపీఎల్-8లో నంబర్ వన్ స్థానంలోనే ప్లే ఆఫ్ కు వెళ్లాలనుకుంటున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ గెలిచిన అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ..లీగ్ దశలో నంబర్ వన్ టీమ్ గానే ముగింపు పలకాలని కోరుకుంటున్నామన్నాడు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్టుల ప్రత్యేక అవకాశాలపై గురించి పెద్దగా ఆసక్తి లేకపోయినా.. సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్ లు గెలవడమే తమ ప్రధాన లక్ష్యమన్నాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ ను కైవశం చేసుకున్న చెన్నై.. పాయింట్ల పట్టికలో కోల్ కతాను వెనక్కు నెట్టి మళ్లీ టాప్ ప్లేస్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.