కరాచి: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ఆ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ నెలాఖర్లో వకార్ బాధ్యతల్ని స్వీకరించనున్నట్లు, రెండేళ్లపాటు అతడు ఈ బాధ్యతల్ని నిర్వర్తించే విధంగా ఒప్పందం కుదిరినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ నజమ్ సేథి ప్రకటించారు. వకార్‌తోపాటు చీఫ్ సెలక్టర్ కమ్ మేనేజర్‌గా మొయిన్‌ఖాన్‌ను నియమించినట్లు తెలిపారు. గతంలోనూ (2010- 2011లో) పాక్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన వకార్.. అప్పట్లో వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
బ్యాటింగ్ కోచ్‌గా గ్రాంట్ ఫ్లవర్
జింబాబ్వే మాజీ ఆటగాడు గ్రాంట్ ఫ్లవర్.. పాక్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యే అవకాశాలున్నాయి. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్‌కు ఈ బాధ్యతలు అప్పగించేందుకు పీసీబీ ప్రయత్నించినా.. అతడు తన వ్యాపార పనుల్లో బిజీగా ఉన్నందున అంగీకరించలేదని తెలుస్తోంది.
పాకిస్థాన్ ప్రధాన కోచ్‌గా వకార్
Published Sat, May 3 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM
Advertisement
Advertisement