యువీతో కలిసి గ్యాంగ్నమ్ డాన్స్ చేస్తా: క్రిస్ గేల్
యువీతో కలిసి గ్యాంగ్నమ్ డాన్స్ చేస్తా: క్రిస్ గేల్
Published Mon, Apr 14 2014 10:53 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
బెంగళూరు: ఐపీఎల్ లో యువరాజ్ సింగ్ తో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ తెలిపారు. బుధవారం యూఏఈలో ఐపీఎల్ ప్రారంభకానున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇతర అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడటమనేది తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అధికారిక వెబ్ సైట్ లో గేల్ తెలిపారు.యువీతో కలిసి గ్యాంగ్నమ్ డాన్స్ చేయడానికి ఎదురు చూస్తున్నాని గేల్ అన్నారు.
మైదానంలో ఫ్యాన్స్ కు పూర్తి స్థాయి వినోదాన్ని పంచుతామని గేల్ తెలిపారు. గత రెండు సీజన్లలో ట్రోఫిని గెలుచుకోలేకపోయామని.. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ విజేతలుగా నిలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఆల్ రౌండర్ విరాట్ కోహ్లీ అద్బుతమైన ఫామ్ లో ఉండటం సానుకూల అంశమని క్రిస్ గేల్ తెలిపారు.
Advertisement
Advertisement