గేల్ దుమారం, సమీ హోరు.. కంగారెత్తించిన వెస్టిండీస్ | West Indies beats Australia in t-20 world cup | Sakshi
Sakshi News home page

గేల్ దుమారం, సమీ హోరు.. కంగారెత్తించిన వెస్టిండీస్

Published Fri, Mar 28 2014 6:50 PM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM

West Indies beats Australia in t-20 world cup

మీర్పూర్: విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ (35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 53) హాఫ్ సెంచరీకి తోడు కెప్టెన్ సమీ (13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 నాటౌట్) మెరుపులు తోడవడంతో టి-20 ప్రపంచ కప్లో వెస్టిండీస్.. ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. శుక్రవారమిక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ పోరులో కరీబియన్లు ఆరు వికెట్లతో ఉత్కంఠ విజయం సాధించారు. 179 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన విండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలుండగా విజయాన్నందుకుంది.

చివరి 12 బంతుల్లో విండీస్ విజయానికి 31 పరుగులు అవసరం. ఈ దశలో సమీ రెచ్చిపోయాడు. స్టార్క్ ఓవర్లో సమీ ఓ సిక్సర్, రెండు ఫోర్లతో సహా 19 పరుగులు రాబట్టాడు. ఫాల్కనర్ వేసిన చివరి ఓవర్లో బ్యాటింగ్ కొనసాగించిన సమీ వరుసగా రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కంగారూలు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 178 పరుగులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement