రాణించిన జహీర్ | Zaheer Khan is back into form | Sakshi
Sakshi News home page

రాణించిన జహీర్

Published Sun, Oct 13 2013 1:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

రాణించిన జహీర్

రాణించిన జహీర్

 హుబ్లి: భారత పేస్ బౌలర్ జహీర్ ఖాన్ ఎట్టకేలకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచాడు. చివరి రోజు జహీర్ (4/59) చెలరేగడంతో మూడో అనధికారిక టెస్టులో వెస్టిండీస్ ‘ఎ’పై భారత్ ‘ఎ’ జట్టు ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

జహీర్‌తో పాటు అభిషేక్ నాయర్ (2/45) కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్ నాలుగో రోజు శనివారం 116/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన వెస్టిండీస్ 73.5 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌటైంది. దేవ్‌నారాయణ్ (180 బంతుల్లో 99; 13 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, ఫుదాదిన్ (101 బంతుల్లో 49; 5 ఫోర్లు) కొద్ది సేపు అండగా నిలిచాడు.

ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు  82 పరుగులు జోడించారు. ఆఖరి రోజు 38.5 ఓవర్లలో 103 పరుగులు మాత్రమే జోడించి విండీస్ చివరి 7 వికెట్లు కోల్పోయింది. జహీర్‌ఖాన్ రెండు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లతో విండీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఎనిమిది పరుగుల వ్యవధిలో విండీస్ చివరి 4 వికెట్లు కోల్పోగా, హామిల్టన్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాకపోవడంతో జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. తాజా ఫలితంతో మూడు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. తొలి టెస్టులో విండీస్ నెగ్గగా, రెండో టెస్టు డ్రా అయింది. ఈ మ్యాచ్‌తో జహీర్ ఖాన్, గంభీర్ కొంత వరకు తమ ఫామ్‌ను అంది పుచ్చుకోగా, సెహ్వాగ్ మాత్రం అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement