ముంబయి: పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పొత్తులు ఊపందుకుంటున్నాయి. 17 చిన్నచిన్న పార్టీలు కలిసి ‘ఫోర్స్ వన్’గా అవతరించాయి. ‘ఫోర్స్ వన్’ కన్వీనర్, అవామీ వికాస్ పార్టీ అధ్యక్షుడు మంగళవారం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొత్త ఫ్రంట్ ప్రధాన రాజకీయ పార్టీలతో ఎట్టి పరిస్థితిలో కలువదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్, కాషాయరంగు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు.
ముంబయి రిటైర్డ్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ 17 పార్టీలు కలిసి కామన్ మినిమమ్ ప్రోగాం(సీఎంపీ)ని రూపొందించుకున్నట్లు తెలిపారు. సీఎంపీతో ఎన్నికల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీతో కలుస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులు ఇస్తూ తమ సీఎంపీని అంగీకరిస్తే ఆలోచిస్తామని చెప్పారు. లేకుంటే ప్రత్యామ్నాయంను ఎంచుకుంటామని తెలిపారు.సీఎంపీ అంశాలను ఆయన వెల్లడించారు.
విదేశీ పెట్టుబడులను భారత్‌లోకి ప్రత్యక్షంగా అనుమతించరాదు, మత వ్యతిరేక బిల్లును ఆమోదించాలి, సచార్ కమిటీ నివేదికను అమలు చేయాలి, మహారాష్ట్రలో మహ్మద్ ఉర్ రెహ్మాన్ కమిటీ నివేదికను పూర్తిస్థాయిలో అమలు పర్చాలి, ఆర్‌ఎస్‌ఎస్, సనాతన సంస్థ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌లను నిషేధించాలి, దాదర్‌లోని బీఆర్ అంబేద్కర్ మెమోరియల్‌కు అడ్డంకులను తొలగించాలి, దళితులు, ముస్లిం, ఇతర మైనార్టీల హక్కులను పరిరక్షించాలి వంటి అంశాలను సీఎంపీలో పొందుపర్చినట్లు ఆయన వివరించారు. 48 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకవేళ తమ భావజాలంతో ఎవరైనా కలిసి వస్తే వారిని ఆహ్వానిస్తామని తెలిపారు. అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లోనూ అదేవిధంగా పోటీ చేస్తామని తెలిపారు.
‘ఫోర్స్ వన్’ ఆవిర్భావం
Published Tue, Feb 11 2014 11:39 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement