25 పిల్లలకు జన్మనిచ్చిన కొండచిలువ | 25 pythons born in chennai zoo | Sakshi

25 పిల్లలకు జన్మనిచ్చిన కొండచిలువ

Jul 20 2016 10:04 AM | Updated on Sep 4 2017 5:29 AM

25 పిల్లలకు జన్మనిచ్చిన కొండచిలువ

25 పిల్లలకు జన్మనిచ్చిన కొండచిలువ

వండలూర్ జూలో ఓ కొండచిలువ 25 పిల్లలకు జన్మనిచ్చింది.

చెన్నై: వండలూర్ జూలో ఓ కొండచిలువ 25 పిల్లలకు జన్మనిచ్చింది. వండలూరు అన్నా జువాలజికల్ పార్కులో 25 కొండచిలువలు సంరక్షణలో ఉన్నాయి. అందులోని ఒక ఆడ కొండచిలువ ఏప్రిల్ 8వ తేదీ 45 గుడ్లుపెట్టింది. అందులో గత నెల 23న 20 గుడ్ల నుంచి 20 కొండచిలువ పిల్లలు బయటకు వచ్చాయి.

అనంతరం ఈ నెల 18న మరో 25 గుడ్ల నుంచి 25 కొండచిలువ పిల్లలు వచ్చాయి. ప్రస్తుతం వీటితో కలిపి మొత్తం కొండచిలువ పిల్లల సంఖ్య 45కు చేరింది. సరాసరి బరువు 89.28 గ్రాములు ఉన్న ఈ కొండచిలువ పిల్లలు సుమారు 28 అడుగుల పొడవు వరకు పెరిగే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement