కొత్త ఏడాది తొలిరోజే స్వైన్‌ఫ్లూ కేసు నమోదు | 3 more cases of swine flu detected in Delhi | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాది తొలిరోజే స్వైన్‌ఫ్లూ కేసు నమోదు

Published Fri, Jan 2 2015 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

3 more cases of swine flu detected in Delhi

న్యూఢిల్లీ:నగరంలో కొత్త ఏడాది తొలిరోజే  స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. గత ఏడాదితో కలిపి ఈ వ్యాధిపీడితుల సంఖ్య 39కి చేరుకుంది. ఆరోగ్య శాఖ అందించిన వివరాల ప్రకారం వాయవ్య ఢిల్లీలోని బవానా ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మహిళ కు గురువారం స్థానిక ఆస్పత్రిలో పరీక్షలు జరపగా హెచ్1ఎన్1 పాజిటివ్ అని తేలింది. సదరు మహిళ నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు పంపించగా హెచ్1ఎన్1 పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య శాఖ అదనపు సంచాలకుడు డాక్టర్ చరణ్‌సింగ్ తెలిపారు. కాగా వరుసగా మంగళ, బుధవారాల్లో నగరంలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా... సంబంధిత అధికారులతో తాజా పరిస్థితులను సమీక్షించారు. ఇందుకు సంబంధించి ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తగు మార్గదర్శకాలను జారీచేశారు. తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement