
ముప్పావుగంట నిలిచిపోయిన మెట్రో
న్యూఢిల్లీ: జహంగీర్‌పురి-హుడా సిటీ సెంటర్ లైన్‌పై ప్రయాణిస్తోన్న ఓ మెట్రో రైలులో సాంకేతిక సమస్య తలత్తడంతో శుక్రవారం ఉదయం ఎనమిదిన్నర గంటలకు యెల్లో లైన్‌పై మెట్రో సేవ లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
న్యూఢిల్లీ: జహంగీర్‌పురి-హుడా సిటీ సెంటర్ లైన్‌పై ప్రయాణిస్తోన్న ఓ మెట్రో రైలులో సాంకేతిక సమస్య తలత్తడంతో శుక్రవారం ఉదయం ఎనమిదిన్నర గంటలకు యెల్లో లైన్‌పై మెట్రో సేవ లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
మెట్రోరైలు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్‌లో సమస్య తలెత్తడంతో నిలి చిపోయిన రైలును కేవలం 20 నిమిషాల్లోనే ట్రాక్‌పై నుంచి తొలగించారు. అయినప్పటికీ ఒక రైలులో తలెత్తిన సమస్య మొత్తం యెల్లో లైన్‌పై ప్రభావం చూపింది.
రద్దీ సమయంలో సమస్య తలెత్తడంతో ఈ మార్గంలోని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు బారులు తీరారు. ఉదయం తొమ్మిది గంటలకు రద్దీ వేళలో మెట్రో రైలు సేవ నిలిచిపోవడంతో గుర్గావ్‌లో ఆఫీసులకు, ఇతర పనులపై బయలు దేరినవారు అసహనానికి గురయ్యారు. సమస్యను గుర్తించిన వెంట నే 15-20 నిమిషాలలో మెట్రో రైలును ట్రాక్‌పై నుంచి తొలగించినట్లు మెట్రో అధికారులు తెలి పారు.
సమస్యను పరిష్కరించేంతవరకు యెల్లోలైన్‌పై ఉన్న మెట్రో రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేయాలని ఆదేశించడంతో ఉదయం రద్దీ వేళల్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో న్యూఢిల్లీ స్టేషన్‌తోపాటు రాజీవ్ చౌక్, చావ్డీ బజార్, చాందినీ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ తదితర స్టేషన్లలో కూడా ప్రయాణికులు బారులు తీరారు. ఈ సమస్య ప్రభావం ప్రధాన ఇంటర్‌చేంజ్ స్టేషన్ అయిన రాజీవ్ చౌక్‌పై కూడా కనిపించింది. రాజీవ్ గేట్ స్టేషన్ ప్రవేశద్వారం వరకు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.
సమస్యను అరగంటలోనే పరి ష్కరించినప్పటికీ పలు స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో మెట్రో రైళ్లు నెమ్మదిగా నడిచాయి. నగరంలోని మెట్రో నెట్ వర్క్‌లో బ్లూలైన్, యెల్లోలైన్‌లలో ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉంటుంది.