50 శాతం సబ్సిడీతో రెయిన్‌గన్‌లు
Published Sat, Aug 27 2016 12:09 PM | Last Updated on Sat, Jun 2 2018 3:08 PM
అమరావతి: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న జిల్లాల్లో 50 శాతం సబ్సిడీతో రెయిన్ గన్స్ పంపిణీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. వెలగపూడిలోని నూతన సచివాలయంలోని నాల్గవ బ్లాకు కింది అంతస్తులో నిర్మించిన వ్యవసాయశాఖ కార్యాలయాన్ని మంత్రి శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంటలను కాపాడతామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో రాజీపడబోమని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement