చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో తమ ప్రభుత్వ వైఖరిని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు యోగేంద్రయాదవ్
భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు
Jan 17 2014 12:02 AM | Updated on Mar 28 2019 6:26 PM
న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో తమ ప్రభుత్వ వైఖరిని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు యోగేంద్రయాదవ్ సమర్థించుకున్నారు. ఈ విషయంలో ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడు వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. గురువారం ఉదయం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సభ్యులకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చన్నారు. తమ పార్టీలో 15 లక్షలమందికిపైగా సభ్యులు ఉన్నారన్నారు. ప్రతి కీలక విషయంలోనూ తమ పార్టీలో ఏకాభిప్రాయం ఉందన్నారు. కెప్టెన్ గోపీనాథ్ సహా పలువురు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన విషయం తనకు తెలుసన్నారు. 15 లక్షలమంది సభ్యుల్లో కొందరు పదాధికారులు, పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఉన్నారన్నారు. కాగా ఎఫ్‌డీఐలను ఆప్ ప్రభుత్వం వ్యతిరేకించడంపై ఆ పార్టీ సభ్యుడు గోపీనాథ్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే. దీనిపై యోగేంద్ర యాదవ్ పైవిధంగా స్పందించారు.
Advertisement
Advertisement