కామారెడ్డిలో ప్రణీత సందడి
కామారెడ్డి : నటి ప్రణీత సోమవారం కామారెడ్డిలో సందడి చేశారు. నిజాంసాగర్ చౌరస్తాలో లక్కీ జీన్స్ కార్నర్ షాపింగ్‌మాల్‌ను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆయా విభాగాలకు చెందిన కౌంటర్ల వద్దకు వెళ్లి దుస్తులు, చీరలు పరిశీలించారు. సినీ నటిని చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో చౌరస్తా కిక్కిరిసింది.