దాదర్, న్యూస్‌లైన్: స్థానిక ఆంధ్ర కళా సమితి (ఏకేఎస్) కార్యవర్గం నవీముంబైలోని పన్వెల్ లోగల ‘స్నేహకుంజ్ ఆధార్ ఘర్’ అనే వృద్ధాశ్రమాన్ని ఇటీవల సందర్శించింది. సర్వీస్ బ్రింగ్స్ స్మైల్ పేరిట ఆంధ్ర కళా సమితి... ప్రతి నెలా చేపడుతున్న సామాజిక కార్యక్రమంలో భాగంగా పది మంది సభ్యుల బృందం ఉదయం 11.00 గంటలకు అక్కడికి చేరుకుని వృద్ధులు, మానసిక వికలాంగులను పరామర్శించింది.
ఈ సందర్భంగా ఈ ఆశ్రమంలోని వారికి బిస్కట్లు, వివిధ రకాల ఫలాలు,అలాగే స్టీల్ ప్లేట్లు, గ్లాసులను బహుమతులుగా అందించింది.. సమితి ప్రధాన కార్యదర్శి పి.ఎస్. జీ.వి. సుబ్రమణ్యం ఆధ్వర్యంలో సభ్యులు కె. వాసుదేవాచార్యులు, డి, శ్రీనివాస్, కిరణ్ కుమార్, వెంకట రెడ్డి, రమేష్ తదితరులు ఈ ఆశ్రమాన్ని సందర్శించినవారిలో ఉన్నారు. ‘సర్వీస్ బ్రింగ్స్ స్మైల్’ పేరిట సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలకు దాతలు శక్తిమేర విరాళాలు అందించి సహకరించాలని ఏకేఎస్ కార్యదర్శి సుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు. దాతలు 09757418822 నంబరుతో సంప్రదించి విరాళాలు అందజేయవచ్చు.
వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఏకేఎస్ కార్యవర్గం
Published Wed, Mar 19 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM
Advertisement
Advertisement