పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత
Published Mon, Oct 24 2016 3:04 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బడిదేవరకొండ, బోడి కొండలో గ్రానైట్ తవ్వకాలు నిలిపేయాలంటూ సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏలో కలెక్టర్ గ్రీవన్ సెల్ నిర్వహిస్తున్నారు. గ్రీవెన్ సెల్ నుంచి కలెక్టర్ ను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వామపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement