అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లును అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోగా అమలు చేయడం
ఆప్ వాగ్దానాలివీ...
Published Tue, Dec 24 2013 1:08 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్‌లోక్‌పాల్ బిల్లును అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోగా అమలు చేయడం
స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నిర్ణయం తీసుకోవడానికి మూడు వేల మొహల్లా సభలను ఏర్పాటు చేయడం.
పనుల నాణ్యత సక్రమంగా ఉన్నట్టు ఈ సభను నిర్ధారిస్తేనే ప్రభుత్వం సదరు కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లిస్తుంది.
కరెంటు చార్జీలను సగం తగ్గిస్తారు. డిస్కమ్‌ల ఖాతాలకు ఆడిటింగ్ నిర్వహిస్తారు. అధిక బిల్లులను సవరిస్తారు.
రెండు లక్షల మరుగుదొడ్ల నిర్మాణం
రోజుకు 700 లీటర్ల కంటే తక్కువ వాడే
కుటుంబాలకు అంతేమొత్తం నీటిని ఉచితంగా సరఫరా చేస్తారు
ఈ ఏడాది నవంబర్ దాకా వచ్చిన అధిక బిల్లులను రద్దు చేస్తారు.
ఢిల్లీ పోలీసులు, డీడీఏను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తెస్తారు
మైనారిటీలకు రక్షణ కల్పిస్తారు. నకిలీ ఎన్‌కౌం టర్లు, ముస్లిం యువతపై కేసులకు ముగింపు
అవినీతికి పాల్పడే అధికారులను తొలగించి వారి ఆస్తులను స్వాధీనపర్చుకుంటారు. అశోక్ ఖేమ్కా, దుర్గాశక్తి నాగపాల్ వంటి అధికారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు
ఆపదల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి వార్డులో పౌరరక్షక దళాన్ని ఏర్పాటు చేస్తారు
ఢిల్లీ ప్రభుత్వం వ్యాజ్యదారు అయితే ఈ కేసు వాయిదాపడకుండా చూస్తారు.
Advertisement
Advertisement