రాజీనామా చేస్తా.. మెజారిటీ సీట్లు సాధిస్తాం: కేజ్రివాల్
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మండిపడ్డారు. పార్లమెంట్ లో జన లోక్ పాల్ బిల్లును ఆమోదించకపోతే రాజీనామా చేయడానికైనా వెనుకాడను అని కేజ్రివాల్ తెలిపారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న బిల్లుకు మద్దతు తెలుపమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం మనగడ ప్రశ్నార్థకమైంది.
మాకు జన లోక్ పాల్, స్వరాజ్ బిల్లు చాలా ప్రధానం. ఆ బిల్లులకు ఆమోదం తెలుపడంలో విఫలమైతే, అధికారంలో కొనసాగడంలో అర్ధం లేదు. అందుకు రాజీనామా చేస్తాను అని కేజ్రివాల్ అన్నారు. అవినీతి వ్యతిరేక బిల్లులను ఆమోదించకపోతే కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ది చెబుతారు అని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే పూర్తి మెజారిటిని సాధిస్తాం అని కేజ్రివాల్ ధీమా వ్యక్తం చేశారు.