హోదా విషయంలో మేం తలదూర్చలేం
ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ప్రత్యేక హోదా రాజకీయ అంశమని, ఇందులో ఉద్యోగులుగా తాము తలదూర్చడం అనవసరమని నిర్ణయించామని ఏపీ ఎన్జీవోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తేల్చిచెప్పారు.స్థానిక ఎన్జీవో కార్యా లయంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రమాణస్వీకారోత్సవం సోమవారం జరిగింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. ప్యాకేజా? ప్రత్యేక హోదా? అనే విషయం ప్రభుత్వం నిర్ణయించుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా వచ్చినా.. రాకపోయినా ఆ ఫలితాన్ని రాజకీయంగా ప్రభుత్వమే అనుభవించాల్సిందే తప్ప,ఉద్యోగులకు ఆపాదించాల్సిందేమీ లేదన్నారు.
ఏపీఎన్జీవో విఫలమైంది
ఏపీజేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
నెల్లూరు(పొగతోట): ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీఎన్జీవో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని, అందువల్లే ఏపీ జేఏసీ ఆవిర్భవించిందని జేఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.సీపీఎస్ విధానం రద్దు కోసం పోరాటం చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాలను కలుపుకొని ఢిల్లీలోని జంతరమంతర్ వద్ద ఆందోళన చేపడతామన్నారు.