సాక్షి, బళ్లారి : అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి బీఎస్ యడ్యూరప్ప, బీ. శ్రీరాములు వి డిపోయి కేజేపీ, బీఎస్‌ఆర్‌సీపీ ఏర్పాటు చేయడంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందని జిల్లా కాంగ్రెస్ పరిశీలకులు మల్లికార్జున నాగప్ప, సగీర్ అహ్మద్‌లు పేర్కొన్నారు. బళ్లారి లోక్‌సభ అభ్యర్థి కోసం పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేం దుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గత అ సెంబ్లీ ఎన్నికల కంటే కేవలం 2 శాత ం మాత్రమే ఓట్ల శాతం పెరిగిందని గుర్తు చేశారు. తమకు అధికారం వచ్చింది కదా? అని కార్యకర్తలు, నేతలు విర్రవీగితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీజేపీ నుంచి విడిపోయిన కేజేపీ, బీఎస్‌ఆర్‌సీపీలు స్వతంత్రంగా పోటీ చేస్తా యా? లేక బీజేపీలో తిరిగి కలుస్తాయా? అనేది ఇంకా స్పష్టంగా తెలియ లేదన్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు వీలవుతుందన్నారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయికే కిలో బియ్యం, క్షీరభాగ్య వంటి సంక్షేమ పథకాలను జారీ చేసి జనరంజక పాలన అంది స్తున్నారన్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బళ్లారి లోక్‌సభ నుంచి 1999లో సోనియాగాంధీ పోటీ చేసి గెలుపొందారని గుర్తు చేశారు. బళ్లారి జి ల్లాపై మేడం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ లు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.
తాము ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మాత్రమే వచ్చామని, టికెట్ కేటాయింపు తమ చేతుల్లో లేదన్నారు. అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థిని లోక్‌సభ అభ్యర్థిగా రంగంలోకి దింపుతారన్నారు. ఈ కార్యక్రమంలో బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్, కాంగ్రెస్ పరిశీలకులు గోపీనాథ్, చంద్రిక పరమేశ్వరీ, మాజీ ఎంపీ ఎన్‌వై హనుమంతప్ప, బళ్లారి నగర జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, మాజీ ఎంపీ కోళూరు బసవనగౌడ, జిల్లా కాంగ్రెస్ నాయకులు పంపాపతి, డేగులపాడు నారాయణప్ప, వెంకటరావ్ ఘోర్పడే, అసుండి వన్నూరప్ప(వండ్రీ), గిరిమల్లప్ప, కమలా మరి స్వామి, కార్పొరేటర్లు వెంకటరమణ, అశోక్, బె ణకల్ బసవరాజగౌడ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ చీలిపోవడంతోనే కాంగ్రెస్‌కు అధికారం
Published Sun, Aug 4 2013 5:45 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement