రన్ ఫర్ యూనిటీకి స్పందన | BJP's 'Run for India' unity receives positive response | Sakshi
Sakshi News home page

రన్ ఫర్ యూనిటీకి స్పందన

Published Mon, Dec 16 2013 1:14 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

BJP's 'Run for India' unity receives positive response

 తిరువళ్లూరు, న్యూస్‌లైన్:సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి వేడుకలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడి ప్రతిష్టాత్మకంగా పిలుపు నిచ్చిన రన్ పర్ యూనిటీకి తిరువళ్లూరులో అపూర్వ స్వాగతం లభించింది. తిరువళ్లూరు బీజేపీ నగర అధ్యక్షుడు బాలాజీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ నేతలు సుఖదేవ్, జానకిరామన్, దురైపాండ్యన్ హాజరయ్యారు. రన్ పర్ యూనిటీ పరుగుపందెంలో పాల్గొనడానికి తిరువళ్లూరు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు హాజరయ్యారు. తిరువళ్లూరు ఆయిల్ మిల్ నుంచి ప్రారంభమైన పరుగుపందెం దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కామరాజర్ విగ్రహం వరకు సాగింది. ఈ పందెంలో పాల్గొన్న పలువురు యువకులు దేశ సమైక్యత కోసం పాల్గొన్నట్టు వివరించారు. అనంతర ం ముగింపు సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రన్ పర్ యూనిటీ పేరుతో మోడి ఇచ్చిన పిలుపునకు జిల్లా నలుమూలల నుంచి వేలమంది యువకులు హాజరుకావడంపై  ఆయన పట్ల యువతకు ఉన్న నమ్మకాన్ని తెలియచేస్తుందని తెలి పారు. పరుగు పందెంలో పాల్గొన్న చిన్నారులు, యువకులకు సర్టిపికెట్లు అందజేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement