
ధనుష్‌పై కేబుల్ ఆపరేటర్ల ఆగ్రహం
పాపులారిటీ ఒక్కోసారి తలనొప్పులకు దారితీస్తుందని ఇంతకుముందు చాలా సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా నటుడు ధనుష్‌కి అలాంటి పరిస్థితే ఎదురైంది. సక్సెస్‌ఫుల్ నటుడిగా, నిర్మాతగా దూసుకుపోతున్న ధనుష్ పాపులారిటీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధనుష్‌కు నటుడిగా బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉందన్న విషయం తెలిసిందే. మరి అంత ప్రాచుర్యం గల నటుడిని వాణిజ్య సంస్థలు వాడుకోవాలను కోవడంతో కొత్తేముంది. ప్రస్తుతం ధనుష్ వాణిజ్య ప్రకటనలోను బిజీగా ఉన్నారు.
అలా ఆయన ఇటీవల నటించిన డీడీఎస్ ప్రకటన తలకొట్టుకు దారితీసింది. ఆ ప్రకటనలో ధనుష్ డీడీఎస్ ప్రాముఖ్యతను తెలిపే విషయంలో కేబుల్ టీవీలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారట. దీంతో కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం ఆ ప్రకటనపై భగ్గుమంది. దీంతో ఆ ప్రకటన నుంచి ఆ వ్యాఖ్యల్ని తొలగించినా నటుడు ధనుష్ అలాంటి ప్రకటనలో ఎలా నటిస్తారని ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అందుకు ధనుష్ క్షమాపణ చెప్పాలని లేదంటే ఆయనపై ఫిర్యాదు చేస్తామని కేబుల్‌టీవీ ఆపరేటర్ల సంఘం డిమాండ్ చేస్తున్నారు.